CBI: వివేకా హత్య కేసులో 15 మందితో అనుమానితుల జాబితాను సిద్ధం చేసిన సీబీఐ

CBI continues probe in YS Viveka murder case
  • వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
  • కడప కేంద్రంగా సీబీఐ విచారణ
  • త్వరలోనే అనుమానితులను విచారించే అవకాశం
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ 15 మందితో అనుమానితుల జాబితాను రూపొందించింది. ఇకపై కడప కేంద్రంగా దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధమైన సీబీఐ, అనుమానితులను ఇక్కడి పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో విచారించాలని నిర్ణయించింది.

ఈ కేసులో తొలుత విచారణ జరిపిన సిట్ తన నివేదికలను మూడు సంచుల్లో సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఫైళ్ల పరిశీలన పూర్తికాగానే అనుమానితుల విచారణ షురూ కానుంది!

అనుమానితుల జాబితాలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవాలని సీబీఐ భావిస్తోంది. కాగా, వివేకా హత్యకేసును స్వీకరించిన సీబీఐ ఇప్పటికే కేస్ రీకన్ స్ట్రక్ట్ చేసింది. వివేకా నివాసానికి వెళ్లి హత్య తీరుతెన్నులను పరిశీలించారు.
CBI
YS Vivekananda Reddy
Murder
Kadapa
SIT
YSRCP
Andhra Pradesh

More Telugu News