Child Traffiking: విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రి కేంద్రంగా పసిపిల్లల అక్రమ రవాణా

Vizag police busted a child traffiking rocket at a private hospital
  • సృష్టి ఆసుపత్రి నుంచి అక్రమ రవాణా జరుగుతోందన్న పోలీసులు
  • సృష్టి ఆసుపత్రి ఎండీ నమ్రత ప్రధాన నిందితురాలని వెల్లడి
  • అక్రమ రవాణాలో ఇద్దరు ఆశా వర్కర్ల ప్రమేయం!
విశాఖపట్నం నగరంలో సృష్టి ఆసుపత్రి నుంచి పసిపిల్లల అక్రమ రవాణా జరుగుతోందని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. సృష్టి ఆసుపత్రిపై పసిపిల్లల అక్రమ రవాణా కేసు నమోదు చేశామని చెప్పారు. పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని పసిబిడ్డల అక్రమరవాణా జరుగుతోందని, ఇందులో సృష్టి ఆసుపత్రి ఎండీ నమ్రత ప్రధాన నిందితురాలని ఆయన స్పష్టం చేశారు.

గత నెల 24న సుందరమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆమె ప్రసవించాక బిడ్డను కోల్ కతాలో ఉన్నవారికి అమ్మేశారని సీపీ వివరించారు. సృష్టి ఆసుపత్రి కేంద్రంగా ఈ వ్యవహారం జరిగినట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని, ఈ పసిపిల్లల అక్రమ రవాణా కేసులో ఇద్దరు ఆశా వర్కర్ల ప్రమేయం కూడా ఉందని ఆర్కే మీనా పేర్కొన్నారు.
Child Traffiking
Vizag
RK Meena
Police
Private Hospital

More Telugu News