Andhra Pradesh: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు... తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు

Firing at Andhra and Odisha border
  • ఓ మావోయిస్టు మృతి
  • ఘటన స్థలం నుంచి ఓ రైఫిల్, పిస్టల్ స్వాధీనం
  • తప్పించుకున్న వారికోసం గాలింపు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో తుపాకులు గర్జించాయి. మల్కన్ గిరి జిల్లా గుజ్జేడు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు గుర్తించారు. తప్పించుకున్న మావోయిస్టు కీలక నేతల కోసం కూంబింగ్ ముమ్మరం చేశారు.

ఘటన స్థలి నుంచి ఒక 303 రైఫిల్, ఒక పిస్టల్, కొన్ని కిట్ బ్యాగులు, పలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మందుపాతరలను పేలకుండా నిర్వీర్యం చేశారు. కాగా, కాల్పుల్లో మరణించిన మావోయిస్టును పాంగి దయ అని గుర్తించారు. పాంగి దయ స్వస్థలం విశాఖ జిల్లా వాకపల్లి. దయ గత 6 సంవత్సరాల నుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
Andhra Pradesh
Odisha
Firing
Maoist
Death
Police

More Telugu News