Errabelli: పీఏ, గన్ మన్లు, సెక్యూరిటీకి కరోనా... క్వారంటైన్ లోకి తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి!

Telangana Minister Errabelli Home Quarentined after 6 Tested Positive in His Home
  • ఎర్రబెల్లి ఇంట్లో 40 మందికి పరీక్షలు
  • ఆరుగురికి కరోనా పాజిటివ్
  • చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలింపు
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వీయ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఇద్దరు ిన్ మన్లు, ఓ కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారంతా గత కొన్ని రోజులుగా ఎర్రబెల్లితోనే ఉండటంతో ఆయన హోమ్ క్వారంటైన్ అయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా, పర్వతగిరి మండలంలోని మంత్రి స్వగృహంలో ముందు జాగ్రత్తగా మొత్తం 40 మందికి వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల తరువాత ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరందరినీ చికిత్సనిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 
Errabelli
Corona Virus
Home Quarantine

More Telugu News