Balakrishna: కరోనా నివారణ కోసం వీవీ వినాయక్ కు హోమియో మాత్రలు పంపిన బాలకృష్ణ

Balakrishna sends Homeo medicine to VV Vinayak for corona prevention
  • విటమిన్ ట్యాబ్లెట్లు కూడా పంపిన బాలయ్య
  • 24 క్రాఫ్ట్స్ కు చెందిన అందరికీ మెడిసిన్ పంపిణీ
  • బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పిన వీవీ వినాయక్
కరోనా వైరస్ సోకకుండా నివారించడంలో హోమియోపతి పిల్స్ ఉపయోగపడతాయని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తన సన్నిహితులకు, సినీ పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ హోమియో పిల్స్ పంపిస్తున్నారు. తాజాగా, బాలకృష్ణ తనకు కూడా హోమియా పిల్స్, విటమిన్ ట్యాబ్లెట్లను పంపారని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ వెల్లడించారు. తనకే కాకుండా చిత్ర పరిశ్రమలోని  24 విభాగాలకు చెందిన అందరికీ ఈ మెడిసిన్ పంపిస్తున్నారని తెలిపారు. తనను గుర్తుంచుకుని మరీ మెడిసిన్ పంపినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వీవీ వినాయక్ పేర్కొన్నారు.
Balakrishna
VV Vinayak
Homeo Medicine
24 Crafts
Tollywood
Corona Virus

More Telugu News