చాతుర్మాస్య దీక్షా వస్త్రాలలో శుభకార్యానికి వచ్చిన పవన్... ఫొటో పంచుకున్న నితిన్
- నితిన్ ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమం
- సరికొత్తగా కనిపించిన పవన్
- కృతజ్ఞతలు తెలిపిన నితిన్
ఈ సందర్భంగా పవన్ చాతుర్మాస్య దీక్షా వస్త్రాలలో ఆధ్యాత్మికత ప్రస్ఫుటించేలా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోను నితిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా హృదయపు లోతుల్లోంచి మా పవర్ స్టార్ కు వేలవేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు. నన్ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమానికి వచ్చి నన్ను దీవించినందుకు ఆనందంగా ఉంది. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది" అంటూ నితిన్ ట్వీట్ చేశారు.