వైయస్ వివేకా మర్డర్ కేసు.. టెక్నికల్ టీమ్ ని రంగంలోకి దించిన సీబీఐ!
- వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సీబీఐ
- కాల్ డేటాను విశ్లేషించనున్న టెక్నికల్ టీమ్
- అనుమానితులను పూర్తి స్థాయిలో విచారించే అవకాశం
తాజాగా టెక్నికల్ టీమ్ ను కూడా రంగంలోకి దించారు. వివేకాతో పాటు ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న వారి కాల్ డేటాను విశ్లేషించనున్నారు. ఎస్ఎంఎస్ ల రూపంలో ఏదైనా సమాచారం పంపారా? అనే విషయాలను కూడా టెక్నికల్ టీమ్ పరిశీలించనుంది.
మరోవైపు వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. మిగిలిన అనుమానితులను కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.