నిజంగానే కరోనా వచ్చిందా? లేక జగన్ కు దూరంగా ఉండేందుకు అలా చెప్పారా?: విజయసాయిపై టీడీపీ ఎమ్మెల్యే గణేశ్ అనుమానాలు
- కరోనా కట్టడిలో విశాఖ యంత్రాంగం విఫలమైంది
- కరోనాను జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదు
- కరోనా కేంద్రాల్లో సదుపాయాలు దారుణంగా ఉన్నాయి
కరోనా కట్టడిలో విశాఖ జిల్లా యంత్రాంగం విఫలమయిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నారా? లేరా? అనే డౌట్ కలుగుతోందని చెప్పారు. కరోనాను జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శించారు. సీఎం నిర్లక్ష్యం వల్లే కేసులు అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పారు. కరోనా కేంద్రాల్లో సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.