KTR: డియర్ తారక్... మరింత శక్తితో ముందుకు సాగాలి!: కేటీఆర్ కు చిరంజీవి విషెస్

Chiranjeevi Wishes to KTR
  • నేడు కేటీఆర్ పుట్టిన రోజు
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • బావ హరీశ్ కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
"హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తితో ముందుకు సాగాలి" అని మెగాస్టార్ చిరంజీవి, నేడు 44వ ఏట అడుగు పెడుతున్న తెలంగాణ మునిసిపల్, ఐటీ మంత్రి కే తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు.

 "పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలి" అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేయగా, "బావా... చాలా కృతజ్ఞతలు" అని కేటీఆర్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో మరిన్ని సంవత్సరాలు కేటీఆర్ కొనసాగాలని, ఇంకా పెద్ద పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నప్పుడు కేటీఆర్ తో కలిసి దిగిన చిత్రాన్ని సంతోష్ పంచుకున్నారు.
KTR
Chiranjeevi
Harish Rao

More Telugu News