Ramya Krishna: నాటి జ్ఞాపకం.. సినీనటి రమ్యకృష్ణ సీమంతం ఫొటోలు వైరల్!

Actress Ramya Krishna shares her Seemantham moments
  • నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రమ్యకృష్ణ
  • తన ఇద్దరు పెద్దమ్మలు తనను ఆశీర్వదించారని వ్యాఖ్య
  • తన తల్లికి సంబంధించిన ఫొటో కూడా పోస్ట్
కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ సినీనటులు తమ పాత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సినీనటి రమ్యకృష్ణ తన ట్విట్టర్‌ ఖాతాలో రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. అవి తన సీమంతం వేడుకకి సంబంధించిన ఫొటోలని చెప్పింది.
                              
తన ఇద్దరు పెద్దమ్మలు తనను ఆశీర్వదించారని, వారు ఇప్పుడు జీవించిలేరని పేర్కొంది. మంచి జ్ఞాపకాలని ట్యాగ్‌ జోడించింది. అలాగే, మరో ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేస్తూ ఇందులో తన సీమంతం వేడుకలో పాల్గొన్న తన తల్లి ఉందని చెప్పింది. తన వెనుక నిలబడి తన తల్లి ఫొటోలు తీసిందని తెలిపింది. రమ్యకృష్ణ తల్లి ఇందులో కెమెరా పట్టుకుని నిలబడ్డారు. 2003లో రమ్యకృష్ణ-కృష్ణవంశీల వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

           
Ramya Krishna
Viral Pics
Tollywood

More Telugu News