Rana: తన పెళ్లికి కేసీఆర్, జగన్ లను ఆహ్వానించనున్న రానా

Rana to invite KCR and Jagan to his marriage
  • వచ్చే నెల 8న రానా పెళ్లి వేడుక
  • తన ప్రియురాలు మిహికాను పెళ్లి చేసుకోనున్న రానా
  • ఫలక్ నుమా ప్యాలస్ లో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల్లో పెళ్లి
సినీ హీరో రానా దగ్గుబాటి పెళ్లి రోజు దగ్గరపడుతోంది. తన ప్రియురాలు మిహికా బజాజ్ ను రానా పెళ్లిచేసుకోబోతున్నాడు. వచ్చే నెల 8న హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. తెలుగు, మార్వాడీ సంప్రదాయాల్లో పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఇటీవలే ఇరు కుటుంబాల మధ్య రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి.

మరోవైపు, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలని రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ వివాహానికి ఆహ్వానించనున్నారు. త్వరలోనే కేసీఆర్, జగన్ లను రానా స్వయంగా కలిసి తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నాడు.
Rana
Jagan
KCR
TRS
YSRCP
Marriage
Tollywood

More Telugu News