Etela Rajender: వీరికి మాత్రమే కరోనాతో ఇబ్బంది ఉంది.. ప్రాణ నష్టం జరగకుండా చూడొచ్చు: ఈటల రాజేందర్

We have seen many viruses says Etela Rajender
  • ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లను చూశాం
  • ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి కరోనాతో ఇబ్బంది ఎక్కువ
  • ఎవరికి జ్వరం వచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయాలి
ఇప్పటి వరకు మనం ఎన్నో వైరస్ లను చూశామని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ ను కూడా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని సాధించగలిగామని చెప్పారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి మాత్రమే కరోనా వైరస్ తో ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఆదిలోనే వైరస్ సోకినట్టు నిర్ధారణ జరిగితే ప్రాణనష్టం జరగకుండా చూడొచ్చని చెప్పారు. దీని కోసం ఏ ఒక్కరికి జ్వరం సోకినా ఆశాలు, ఏఎన్ఎంలు వెంటనే వారిని గుర్తించి, కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించాలని ఆదేశించారు. ఈ రోజు జిల్లాల వైద్యాధికారులతో ఈటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ పై సమీక్ష నిర్వహించిన ఆయన... కీలక సూచనలు చేశారు.
Etela Rajender
TRS
Corona Virus

More Telugu News