విజయసాయిరెడ్డిని కలిసినా న్యాయం జరగలేదంటూ.. విషం తాగిన వైసీపీ మహిళా నేత!
- పార్టీ నేతలు తనను మోసం చేశారన్న జోని కుమారి
- కరోనా వల్ల జగన్ ను కలవలేకపోతున్నానని ఆవేదన
- మీడియా సమావేశంలోనే విషం తాగిన వైనం
పార్టీని సొంత కుటుంబంలా భావించానని... అయినా పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు తనను మోసం చేశారని తెలిపారు. 6వ తేదీన విజయసాయిరెడ్డిని కలిసి తన బాధను చెప్పుకున్నానని... అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూనే ఆమె విషం తీసుకున్నారు. వెంటనే ముందున్న టేబుల్ పై తల వాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.