Devineni Sitharamaioah: హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య కన్నుమూత

Heritage Foods ex chairman Devineni Sitharamaiah died
  • కొంతకాలంగా అస్వస్థతో బాధపడుతున్న సీతారామయ్య
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సీతారామయ్య
ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సీనియర్ పార్ట్ నర్, హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య (96) అనారోగ్యంతో కన్నుమూశారు. సీతారామయ్య కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసానికి తీసుకెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సీతారామయ్య తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గానూ, ఆర్ బీఐ ప్రాంతీయ డైరెక్టర్ గానూ వ్యవహరించారు. ఆసుపత్రిలో చేరడానికి వారం ముందు వరకు దేవినేని సీతారామయ్య హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేసినట్టు తెలుస్తోంది. విజ్ఞానజ్యోతి చారిటీ సంస్థ వ్యవస్థాపకుడైన ఆయన ఆ సంస్థకు ట్రెజరర్ గానూ పనిచేశారు. దుండిగల్ వద్ద ఉన్న సేవాశ్రమం వృద్ధాశ్రమానికి చైర్మన్ గా ఉన్నారు.
Devineni Sitharamaioah
Heritage Foods
Former Chairaman
Andhra Pradesh

More Telugu News