Narendra Modi: కేసీఆర్, జగన్ లకు ప్రధాని ఫోన్... కరోనా పరిస్థితులపై ఆరా

PM Modi talks to KCR and Jagan
  • దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
  • పెరుగుతున్న వైరస్ వ్యాప్తి
  • తెలుగు రాష్ట్రాల్లో చర్యలపై సీఎంలను అడిగి తెలుసుకున్న మోదీ
దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తూ ఆందోళనకర పరిస్థితి నెలకొన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, నివారణ చర్యలు, కరోనా టెస్టింగ్ లు తదితర అంశాలపై కేసీఆర్, జగన్ లతో మాట్లాడారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలతోనూ ప్రధాని ఫోన్ ద్వారా సంభాషించారు. బీహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతోనూ కరోనా పరిణామాలపై చర్చించారు. రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు.
Narendra Modi
Jagan
KCR
Corona Virus
Andhra Pradesh
Telangana
COVID-19

More Telugu News