Pune: కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన అక్క... వీర డ్యాన్సులేసిన చెల్లి... వీడియో ఇదిగో!

Girl dances as whirlwind while her elder sister came home after corona treatment
  • పుణేలో ఘటన
  • తీన్మార్ డ్యాన్సులో రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు
  • వీడియో వైరల్
ఇప్పటి రోజుల్లో కరోనా సోకడాన్ని పెను విపత్తు వచ్చినట్టుగా భావిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటే ప్రపంచాన్నే జయించినంతగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఈ పుణే అక్కచెల్లెళ్లే నిదర్శనం. పుణేలో ఇటీవల ఓ యువతికి కరోనా సోకడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఉంటున్న వీధి అంతా రెడ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆ యువతి కరోనా నుంచి కోలుకోవడంతో అధికారులు ఆమెను ఇంటికి తరలించారు.

అయితే, తన అక్కను అల్లంత దూరం నుంచి చూసిన చెల్లెలు వీరావేశంతో డ్యాన్సులు వేస్తూ తన సోదరికి ఎదురెళ్లి స్వాగతం పలికింది. చెల్లెలి సంతోషం చూసి అక్క కూడా కాలు కదిపి తోబుట్టువుతో కలిసి చిందులేసింది. మొత్తమ్మీద ఈ అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Pune
Sisters
Dance
Corona Virus
Treatment
Viral Videos

More Telugu News