Vidyarani: స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణికి యువమోర్చా పదవి అప్పగించిన బీజేపీ

BJP appointed slain smuggler veerappan daughter Vidyarani as youth wing vice president
  • న్యాయవాదిగా వ్యవహరిస్తున్న విద్యారాణి
  • గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరిక
  • వీరప్పన్ వర్గాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నిర్ణయం
గంధపుచెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ కు ఓ కుమార్తె ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు విద్యారాణి (29). తమిళనాడులో ఆమె ఓ లాయర్. కొన్నాళ్ల కిందటే రాజకీయాల్లో ప్రవేశించిన విద్యారాణి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.

అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యారాణికి బీజేపీ మరింతగా ప్రోత్సాహం అందిస్తోంది. ఆమెను బీజేపీ తమిళనాడు యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించింది. విద్యారాణి గత ఫిబ్రవరిలోనే తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణగిరి ప్రాంతంలో వీరప్పన్ వర్గానికి ఉన్న ప్రాబల్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. తన జీవితకాలంలో అత్యధిక భాగం అడవుల్లో కాలం గడిపిన వీరప్పన్ తన కుమార్తెను జీవితంలో ఒకే ఒక్కసారి కలిశాడు.
Vidyarani
Veerappan
Yuvamorcha
Youthwing
Vice President
BJP
Tamilnadu

More Telugu News