ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపిన కేంద్రం
- ఇటీవల హ్యాకింగ్ కు గురైన సెలబ్రిటీల ఖాతాలు
- హ్యాకర్ల బారినపడిన ఖాతాల వివరాలు అందించాలన్న సెర్ట్
- హ్యాకింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటో వివరించాలని ఆదేశం
మాల్వేర్లు, ఇతర వైరస్ లతో కూడిన ట్వీట్లు, లింకులను ఎంతమంది భారతీయులు క్లిక్ చేశారు? వారి ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్టు హెచ్చరిస్తూ ట్విట్టర్ ఏమైనా సందేశాలు పంపిందా? అని సెర్ట్ కోరింది. హ్యాకర్లు ట్విట్టర్ అకౌంట్లపైనే దాడి చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి? హ్యాకింగ్ జరిగిందని తెలిసిన తర్వాత ట్విట్టర్ తీసుకున్న నష్టనివారణ చర్యలు ఏమిటి? అని కూడా సెర్ట్ తన నోటీసుల్లో ప్రశ్నించింది.