Adimulapu Suresh: కేసుల నుంచి తప్పించుకునేందుకే టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లారు: ఏపీ మంత్రి ఆదిమూలపు

AP Minister Adimulapu Suresh comments on TDP leaders
  • ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు
  • నేరాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమన్న ఆదిమూలపు
  • బాబుకు రాజ్యాంగంపై విశ్వాసంలేదని విమర్శలు
ఇటీవల టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. అరెస్ట్ లు, నేరాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలిశారంటూ ఆరోపించారు.

టీడీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. బాబుకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసంలేదని, బాబు పీఎస్ ఇంట్లో సోదాల తర్వాత రూ.2 వేల కోట్ల లావాదేవీలకు ఆధారాలు బయటపడ్డాయని తెలిపారు.
Adimulapu Suresh
Telugudesam
Leaders
New Delhi
President Of India
Chandrababu
Andhra Pradesh

More Telugu News