కరోనా సమయంలో ఇంత భయానకం మరెక్కడైనా ఉందా? వీడియో పోస్ట్ చేసిన శత్రుఘ్న సిన్హా
- బీహార్ లోని ఓ ఆసుపత్రిలో వేచి చూస్తున్న రోగులు
- వందల మంది కనీస భౌతిక దూరంలో లేని పరిస్థితి
- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న శత్రుఘ్న సిన్హా
ఈ వీడియోలో ఆసుపత్రి ఓపీడీ విభాగంలో తలుపులు తీస్తే లోపలికి వెళ్లేందుకు వేచి చూస్తున్న వందలాది మంది కనిపిస్తున్నారు. వారి మధ్య ఏ మాత్రమూ భౌతిక దూరం లేదు. ఒకవేళ ఎవరైనా దూరం జరిగి వెళ్లాలన్నా, చాలినంత స్థలం కూడా అక్కడ కనిపించడం లేదు. కాగా, బీహార్ లో కరోనా శరవేగంగా విజృంభిస్తుండడంతో, ఈ నెల 31 వరకూ పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించారు.