నాలుగు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న రకుల్
- కరోనా వల్ల ముంబైలో ఉండిపోయిన రకుల్
- 20 రోజులు గురుగావ్ లో తల్లిదండ్రులతో గడిపిన హర్యానా భామ
- రకుల్ కు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
తన సొంత రాష్ట్రం హర్యానా కంటే హైదరాబాదే తనకు చాలా ఇష్టమని రకుల్ గతంలో తెలిపింది. అందుకే ఇక్కడే సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన రకుల్ నటిస్తోంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు, దాదాపు 3 నెలల తర్వాత ముంబై నుంచి ఆమె గురుగావ్ కు వెళ్లింది. అక్కడ తన తల్లిదండ్రులతో కలిసి 20 రోజుల పాటు గడిపింది. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది.