పవర్ ఫుల్ టైటిల్ తో మెగా మేనల్లుడి చిత్రం!
- ప్రస్తుతం సాయితేజ్ చేతిలో రెండు సినిమాలు
- తాజాగా నూతన దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
- 'భగవద్గీత సాక్షిగా' అనే టైటిల్ నిర్ణయం
నూతన దర్శకుడు ఒకరు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఆ ప్రాజక్టుకి సాయితేజ్ ఓకే చెప్పాడని సమాచారం. దీనికి 'భగవద్గీత సాక్షిగా' అనే పవర్ ఫుల్ టైటిల్ని పెట్టినట్టు చెబుతున్నారు. టైటిల్ని బట్టి చూస్తే, ఇదేదో నేరసంబంధమైన పాయింట్ చుట్టూ కోర్టుల నేపథ్యంలో అల్లిన కథలా అనిపిస్తోంది. దేవ కట్టా సినిమా తర్వాత ఈ కొత్త సినిమా సెట్స్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.