రిలయన్స్ జియోతో ఒప్పందంపై సుందర్ పిచాయ్ స్పందన
- ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి
- రిలయన్స్ లో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నాం
- మాకు చాలా గర్వంగా ఉంది
ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పిచాయ్ చెప్పారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ లో తొలి విడతగా రిలయన్స్ లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని... ఇది తమకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో భాగస్వాములం కావడం గొప్పగా ఉందని అన్నారు.