ఐపీఎల్ మీడియా హక్కుల వివాదం.. మధ్యవర్తిత్వం ట్రైబ్యునల్ ద్వారా బీసీసీఐకి రూ. 850 కోట్లు!
- లలిత్ మోదీ హయాంలో అవకతవకలు
- డబ్ల్యూఎస్జీతో మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం
- డీల్ లో కుట్ర ఉందని నిరూపించిన బీసీసీఐ
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బీసీసీఐ నుంచి వైదొలగిన తరువాత ఏర్పడిన వివాదాలన్నీ ఇప్పుడు బీసీసీఐకి లాభిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇది కూడా ఒకటి. అప్పటికే ఎస్క్రో ఖాతాల్లో వేసిన డబ్బులో తమకూ వాటా ఉందని డబ్ల్యూఎస్జీ వాదించగా, ఈ హక్కు ఒప్పందమే మోసపూరితమన్న తన వాదనకు బీసీసీఐ కట్టుబడింది. లలిత్ మోదీ, డబ్ల్యూఎస్జీ అధికారులతో కలిసి మోసం చేసి, ఈ కాంట్రాక్టును వారికి ఇప్పించినట్టు తేలినందునే బీసీసీఐకి చెందాల్సిన డబ్బు వచ్చిందని, ఈ కేసులో బీసీసీఐ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రఘురామన్ వెల్లడించారు.