'లవ్ మాక్ టైల్' తెలుగు రీమేక్ లో తమన్నా!
- కన్నడలో హిట్టయిన 'లవ్ మాక్ టైల్'
- సత్యదేవ్ సరసన కథానాయికగా తమన్నా
- నూతన దర్శకుడు నాగశేఖర్ పరిచయం
ఈ క్రమంలో తాజాగా మరో చిత్రానికి ఆమె సంతకం చేసింది. ఇటీవల కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి తమన్నా ఓకే చెప్పింది. ఇందులో '47 డేస్' ఫేం సత్యదేవ్ హీరోగా నటిస్తాడు. నూతన దర్శకుడు నాగశేఖర్ దీనికి దర్శకత్వం వహిస్తారు.
రొమాంటిక్ మ్యూజికల్ గా రూపొందిన 'లవ్ మాక్ టైల్' కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న దర్శకుడు నాగశేఖర్ రీమేక్ హక్కులను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తాడు.