Roja: నేను క్షేమంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన పడొద్దు: రోజా

I am safe says Roja
  • రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్
  • హోం క్వారంటైన్ లో ఉన్న రోజా
  • ఆందోళన చెందుతున్న రోజా అభిమానులు
వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. గత 20 రోజులుగా ఆయన డ్యూటీకి హాజరుకాలేదు. మరోవైపు, తన గన్ మెన్ కు కరోనా అని తెలిసిన వెంటనే నగరిలోని  తన నివాసంలో రోజా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు. తాను, తన కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Roja
YSRCP
Driver
Corona Virus

More Telugu News