KCR: కేసీఆర్ సెక్యులర్ భావాలకు అది నిదర్శనం: టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

TNGO president praises KCR
  • సచివాలయంలో కొత్త దేవాలయం, మసీదు కట్టిస్తామని చెప్పారు
  • ఘటన గురించి వెంటనే స్పందించారు
  • ఆయనలోని సెక్యులర్ భావాలకు ఇది నిదర్శనం
సెక్రటేరియట్ ప్రాంగణంలో అధునాతన హంగులతో, విశాలమైన దేవాలయం, మసీదును నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అన్నారు. పాత భవనాలను కూల్చివేస్తున్న సందర్భంగా గుడి, మసీదు ధ్వంసం కావడం పట్ల సీఎం తన బాధను వ్యక్తం చేశారని చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించడం, గుడి, మసీదును నిర్మిస్తామని చెప్పడం ఆయనలోని సెక్యులర్ భావాలకు నిదర్శనమని కొనియాడారు. సచివాలయంలో పని చేస్తున్నవారికి దేవాలయం, మసీదు నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తాయని చెప్పారు.
KCR
TRS
Secretariat
TNGO

More Telugu News