India: దేశంలో ఒక్కరోజులో 26,506 మందికి కొత్తగా కరోనా

India reports 475 deaths and the highest single day spike of 26506 COVID19 cases
  • మొత్తం కేసులు 7,93,802
  • మృతుల సంఖ్య మొత్తం 21,604
  • 2,76,685 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారు 4,95,513 మంది
భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,93,802కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,604కి పెరిగింది. 2,76,685 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,95,513 మంది కోలుకున్నారు.
                                 
                    
నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,10,24,491 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,83,659 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది
India
Corona Virus
COVID-19

More Telugu News