బ్రేకింగ్... అనూహ్య పరిస్థితుల్లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ లో మృతి!
- కాన్పూర్ తీసుకుని వస్తుండగా కారు బోల్తా
- తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించిన దూబే
- పోలీసు కాల్పుల్లో మృతి
- ఘటనపై పలు అనుమానాలు
కాగా, ఎనిమిది మంది పోలీసులను వికాస్ గ్యాంగ్ హత్య చేసిన తరువాత, పోలీసులు అతనిపై పగతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో వికాస్ గ్యాంగ్ లోని పలువురిని పోలీసులు కాల్చి చంపారు కూడా. ఈ క్రమంలో తమపై వచ్చిన ఒత్తిడితోనే వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారని కూడా వార్తలు వస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.