కన్నడ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య
- బుల్లి తెరపై సక్సెస్ అయిన సుశీల్
- దునియా విజయ్ సినిమాతో చిత్రసీమలోకి అడుగు
- సినిమా విడుదల కాకముందే ఆత్మహత్య
మరోవైపు సుశీల్ ఆత్మహత్యపై దునియా విజయ్ స్పందించాడు. సుశీల్ ను తొలిసారి చూసినప్పుడు హీరో కావాల్సిన వ్యక్తి అని అనుకున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడని భావించానని, కానీ అందరినీ వదిలి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య దేనికీ సమాధానం కాదని చెప్పాడు. కరోనా భయం వల్లే కాక.. జీవించడానికి డబ్బు దొరకదనే నమ్మకాన్ని కోల్పోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నాడు. కష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పాడు.