దయచేసి వాస్తవాలను తెలుసుకుని వార్తలను రాయండి: యాంకర్ ఝాన్సీ
- కరోనా బారిన పడుతున్న బుల్లితెర ప్రముఖులు
- తనకు కరోనా సోకలేదని వివరణ ఇచ్చిన ఝాన్సీ
- తాను ఐసొలేషన్ లో ఉన్నానని వ్యాఖ్య
తనతో పాటు పని చేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలిందని... దీంతో తాను ఐసొలేషన్ లో ఉండిపోయానని చెప్పింది. ఇప్పటికే ఏడు రోజుల ఇంక్యుబేషన్ పూర్తయిందని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్పింది. వాస్తవాలను చెక్ చేసుకొని వార్తలు రాయాలని మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను కోరుతున్నానని తెలిపింది. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది.