రజనీ, కమల్ ల చిత్రం ఆగిపోలేదట!

  • రజనీ, కమల్ ల మధ్య చక్కని స్నేహం 
  • రజనీ హీరోగా కమల్ నిర్మిస్తున్న చిత్రం
  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం.. నవంబర్లో సెట్స్ కు  
కమలహాసన్.. రజనీకాంత్!
ఇద్దరూ ఒకేసారి కెరీర్ని ప్రారంభించి... అందరూ చూస్తుండగానే ఇద్దరూ అలా.. అలా.. శిఖర స్థాయికి చేరిపోయారు. ఇద్దరూ అద్భుతమైన నటులే.. కాకపోతే ఒకరు క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైతే, మరొకరు మాస్ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఇద్దరి మధ్యా అప్పటి నుంచీ చక్కని స్నేహం కొనసాగుతూనే వుంది.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా కమలహాసన్ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, ఇటీవల మళ్లీ ఈ చిత్రం గురించి అప్ డేట్స్ లేకపోవడంతో ఈ ప్రాజక్టు ఆగిపోయి ఉంటుందని కోలీవుడ్ లో ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రాజక్టు నిలిచిపోలేదనీ, ఈ నవంబర్లో సెట్స్ కి వెళుతుందనీ తెలుస్తోంది. తాజాగా విజయ్ తో 'మాస్టర్' చిత్రాన్ని రూపొందించిన లోకేశ్ కనగ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో కమల్ నటిస్తాడో లేదో ఇంతవరకు వెల్లడికాలేదు. పోతే, ఈ చిత్రంలో నటిస్తున్నందుకు రజనీకి ఆయన వంద కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Kamal Haasan
Rajanikanth
Lokesh Kanagaraj
Vijay

More Telugu News