ఆఖరి దశకు చేరుకున్న ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... అక్టోబరు నాటికి సిద్ధం!
- ఆస్ట్రాజెనెకాతో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ సంయుక్త కృషి
- అనేక దేశాల్లో వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగం
- 3 కోట్ల డోసుల్ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు
ఇప్పటికే దక్షిణాఫ్రికాలో 2 వేల మందికి ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ ఇచ్చారు. బ్రిటన్ లోనూ 4 వేల మంది వలంటీర్లు ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయోగాలు కచ్చితంగా విజయవంతం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా సంస్థ అక్టోబరు నాటికి వ్యాక్సిన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 3 కోట్ల డోసులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.