Telangana: తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభం.. కూలుతున్న సి-బ్లాక్

TS Govt starts secretariat building demolishing work
  • కోర్టు తీర్పుతో ప్రభుత్వంలో జోష్
  • ప్రారంభమైన సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు
  • సచివాలయం వైపు వాహనాలు రాకుండా రోడ్డు మూసివేత
హైకోర్టు తీర్పుతో తెలంగాణ సచివాలయ కొత్త భవన నిర్మాణానికి మార్గం సుగమమైన నేపథ్యంలో పాత భవనం కూల్చివేత పనుల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య  ఈ తెల్లవారుజాము నుంచే భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు. నిజానికి కూల్చివేత పనులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో పనులు ఆలస్యమయ్యాయి.

సచివాలయ భవనం కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్తదాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించింది. ప్రస్తుతం సచివాలయ సి-బ్లాక్‌ను కూల్చివేసే పనులు ప్రారంభించింది.
Telangana
TS secretariat
Building demolishing work

More Telugu News