సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీని మూసేయండి: ఆదేశించిన రెండు శాఖలు
- ఆదేశాలు జారీ చేసిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి
- ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం సుస్పష్టం
- కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన నలుగురు సభ్యుల కమిటీ
రియాక్టర్ నుంచి లీకైన హైడ్రోజన్ సల్ఫైడ్‌ను పీల్చడం వల్లే ఉద్యోగులు మృతి చెందినట్టు తేలింది. ఈ ప్రమాదంలో పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని నిర్ధారణకు వచ్చిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఫ్యాక్టరీ మూసివేతకు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు, ఈ ఘటనపై విచారణ కోసం డీఆర్ఓ పెంచల కిశోర్ అధ్యక్షతన కలెక్టర్ నియమించిన నలుగురు సభ్యుల కమిటీ రెండు రోజుల క్రితమే నివేదికను సమర్పించింది.