తెలంగాణలో కరోనా ఉగ్రరూపం... 24 గంటల్లో 1,831 మందికి పాజిటివ్

Hundreds of new cases emerges in Telangana
  • రాష్ట్రంలో మరో 11 కరోనా మరణాలు
  • 306కి పెరిగిన మృతుల సంఖ్య
  • తాజాగా 2,078 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 1,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. అటు, ఒక్క రోజులో 11 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 306కి పెరిగింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కంటే నేడు డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 2,078 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే... జీహెచ్ఎంసీ పరిధిలో 1,419 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి.
Go Back to Shorts
Corona Virus
Telangana
Positive
Deaths
GHMC
Hyderabad

More Telugu News