Nara Lokesh: కరోనా మృతుడి అంత్యక్రియల్లో మళ్లీ అమానుషంగా వ్యవహరించారు: లోకేశ్

Nara Lokesh questions a corona patient funerals
  • ఇటీవలే విమర్శలపాలైన పలాస ఘటన
  • తిరుపతిలోనూ జేసీబీ సాయంతో అంత్యక్రియలు
  • చనిపోయిన వాళ్లకు గౌరవం ఇవ్వరా? అంటూ లోకేశ్ ట్వీట్
ఇటీవలే శ్రీకాకుళం జిల్లా పలాసలో పొక్లెయిన్ లో కరోనా మృతుల శవాలను శ్మశానానికి తరలించడం తీవ్ర విమర్శలపాలవడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే తిరుపతిలో జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఓ కరోనా రోగి మృతి చెందితే అమానవీయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారని వెల్లడించారు. ఈ విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ట్వీట్ చేశారు.

గుంతలో మృతదేహాన్ని ఉంచడానికి జేసీబీని ఉపయోగించారని ఆరోపించారు. ఈ వీడియోను మృతుడి కుటుంబీలకు చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు. చనిపోయిన వాళ్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వరా? అంటూ నిలదీశారు.
Nara Lokesh
Corona Virus
Death
Funerals
Tirupati

More Telugu News