Varla Ramaiah: జగన్ కాంప్ లో కలవరం: వర్ల రామయ్య

Varla Ramaiah Comments on Jagan
  • జగన్ పై కేసుల విచారణ త్వరితగతిన పూర్తి
  • పై స్థాయిలో నిర్ణయం తీసేసుకున్నారు
  • కోర్టులో విచారణ మొదలు కాకుండా ప్రయత్నాలు
  • ట్విట్టర్ లో వర్ల రామయ్య విమర్శలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ లో కొత్త కలవరం మొదలైందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయుకుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ముఖ్యమంత్రి జగన్ అండ్ టీం పై  వున్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని పై స్థాయిలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జగన్ కాంప్ లో కలవరం మొదలైంది. బలమైన సాక్షులు, కీలకమైన ఆధారాలు వున్న విషయం జగన్ కాంప్ కలవరానికి ముఖ్య కారణం. కోర్టులో విచారణ మొదలు కాకుండా ప్రయత్నాలు మొదలు. నిజంకాదా?" అని ప్రశ్నించారు.
Varla Ramaiah
Jagan
Cases
Twitter

More Telugu News