Tiger: హైదరాబాద్ జూలో పెద్దపులి మృత్యువాత.. పది రోజుల వ్యవధిలో రెండు పులుల కన్నుమూత!

Tiger dies in Hyderabad zoo
  • హార్ట్ ఫెయిల్యూర్ తో కన్నుమూసిన పెద్దపులి
  • దీని వయసు 11 ఏళ్లు
  • కొన్నిరోజులుగా ఆహారం తీసుకోని పులి
హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో కదంబ అనే పెద్ద పులి మరణించింది. దీని వయసు 11 ఏళ్లు. ఇది రాయల్ బెంగాల్ టైగర్ వర్గానికి చెందినది. ఇది మగపులి. కదంబ ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనబర్చలేదని, అయితే తరచుగా ఆహారం తీసుకునేది కాదని జూ వర్గాలు వెల్లడించాయి. దాంతో జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, అయినప్పటికీ మృతి చెందిందని అధికారులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహిస్తే దిగ్భ్రాంతికర విషయం తెలిసిందని, కదంబ హార్ట్ ఫెయిల్యూర్ తో చనిపోయినట్టు వైద్య నిపుణులు తెలిపారని జూ అధికారులు పేర్కొన్నారు.

కదంబను 2014లో కర్ణాటకలోని పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి హైదరాబాద్ జూకి తీసుకువచ్చారు. కాగా, హైదరాబాద్ జూలో గత 10 రోజుల వ్యవధిలో పెద్ద పులులు మృత్యువాత పడడం ఇది రెండోసారి. కొన్నిరోజుల కిందట కిరణ్ అనే పులి మరణించింది. దాని వయసు 8 సంవత్సరాలు. కిరణ్ నియోప్లాస్టిక్ కణితి కారణంగా జూన్ 25న కన్నుమూసిందని జూ వర్గాలు తెలిపాయి.
Tiger
Hyderabad
Zoo
Death
Heart Failure

More Telugu News