ఏపీలో కరోనాతో 14 మంది మృతి... మరో 998 మందికి పాజిటివ్

Fourteen people dies of corona in AP
  • కర్నూలు జిల్లాలో ఐదుగురు మృత్యువాత
  • రాష్ట్రంలో 232కి చేరిన కరోనా మరణాల సంఖ్య
  • తాజాగా 391 మంది డిశ్చార్జి
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఐదుగురు మరణించగా, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 232కి పెరిగింది.

అటు, 998 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 157, తూర్పు గోదావరి జిల్లాలో 118 మందికి కరోనా సోకింది. కొన్నిరోజుల కిందటి వరకు తక్కువ కేసులు వస్తున్న శ్రీకాకుళం జిల్లాలో తాజాగా 96 మంది కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18,697 కేసులు నమోదయ్యాయి. తాజాగా 391 మంది డిశ్చార్జి కావడంతో ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,422కి చేరింది. ప్రస్తుతం 7,907 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 2,136 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Deaths
Positive
COVID-19

More Telugu News