Chandrababu: కొల్లు రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషి: చంద్రబాబు

Chandrababu responds on Kollu Ravindra arrest
  • హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్
  • అవినీతిని ప్రశ్నించాడనే రవీంద్రను అరెస్ట్ చేశారన్న చంద్రబాబు
  • కుటుంబాల మధ్య కక్షలు రెచ్చగొట్టింది వైసీపీనే అంటూ ఆరోపణ
మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కొల్లు రవీంద్ర చీమకు కూడా అపకారం చేయని మనిషి అని పేర్కొన్నారు.

వైసీపీ అవినీతిని ప్రశ్నించాడనే రవీంద్రను హత్యకేసులో ఇరికించారని ఆరోపించారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని, రెండు కుటుంబాల మధ్య కక్షలు రెచ్చగొట్టింది వైసీపీనే అని అన్నారు. 13 నెలలైనా వైఎస్ వివేకా హంతకులను పట్టుకోలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Kollu Ravindra
Arrest
Machilipatnam
Moka Bhaskar Rao
YSRCP

More Telugu News