Sonu Sood: సర్వేలో బాలీవుడ్‌ హీరోలను వెనుకకు నెట్టి అగ్రస్థానంలో నిలిచిన సోనూసూద్

 Sonu Sood beats Akshay to top celebrity performance
  • వలస కార్మికులకు సాయం చేసిన సోను
  • ప్రజలకు సేవ‌లు చేసిన సెలబ్రిటీల పనితీరుపై ఐఐహెచ్‌బీ సర్వే
  • సర్వేలో అక్షయ్‌కు రెండవ, అమితాబ్‌కు మూడవ స్థానం
దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లడానికి సినీనటుడు సోనూ సూద్ సాయం చేసి అందరితోనూ శభాష్ అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ) నిర్వహించిన ఓ సర్వేలో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలకు సేవ‌లు చేసిన సెలబ్రిటీల పనితీరుపై ఐఐహెచ్‌బీ ఈ సర్వే నిర్వహించింది.

అద్భుత సేవలు అందించిన సెలబ్రిటీగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్‌లను వెనకేసి సోనూసూద్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఈ సర్వేలో అక్షయ్ కుమార్ రెండవ స్థానం సాధించగా, అమితాబ్ బచ్చన్ మూడవ స్థానంలో నిలిచారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రతి కార్మికుడు తమ సొంత ప్రాంతానికి చేరే వరకు తాను సాయం చేస్తూనే ఉంటానని సోనూసూద్ కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు. చెప్పినట్లే ఆయన వందలాది మందిని సొంతూళ్లకు పంపడంతో నిజజీవితంలో హీరో అంటూ ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది.
Sonu Sood
Corona Virus
Lockdown
Bollywood

More Telugu News