tapsee: అప్పుడు నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను: హీరోయిన్ తాప్సీ

no words to tell my pain says tapsee
  • సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఉంది
  • నేను కూడా దీనికి బాధితురాలినే
  • ఈ కారణంగానే మొదట్లో పలు అవకాశాలను కోల్పోయా
  • ప్రేక్షకులు కూడా ప్రముఖుల వారసులు నటించిన సినిమాలే చూస్తారు
బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో సినీ పరిశ్రమలో బంధుప్రీతి అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై హీరోయిన తాప్సీ మాట్లాడుతూ తాను కూడా దీనికి బాధితురాలినేనని తెలిపింది. ఇండస్ట్రీలో ప్రముఖుల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారికే పరిచయాలు అధికంగా ఉంటాయని తెలిపింది.

దీంతో అటువంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఈజీగా లభిస్తాయని తాప్సీ చెప్పింది. సినీ పరిశ్రమలో గాడ్‌ ఫాదర్‌ లాంటి వారు లేకుండా ప్రవేశిస్తే అటువంటి వారికి సినీ ప్రముఖులు పరిచయాలు అవడానికి చాలా సమయం పడుతుందని తెలిపింది. ఈ కారణంగానే దర్శకులు కూడా ప్రముఖుల వారసులతోనే సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతారని చెప్పింది.

తాను ఈ కారణంగానే మొదట్లో పలు అవకాశాలను కోల్పోయానని తాప్సీ తెలిపింది. ఆ సమయంలో తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని ఆవేదన చెందింది. ప్రేక్షకులు కూడా ప్రముఖుల వారసులు నటించిన సినిమాలను చూడడానికే ఇష్టపడతారని చెప్పింది.
tapsee
Tollywood
Bollywood

More Telugu News