Ladhak: కార్గిల్, లడఖ్ ప్రాంతాల్లో భూకంపం!

Earth Quake in Ladhak and Cargil
  • తెల్లవారుజామున భూ ప్రకంపనలు
  • ఈ ఉదయం అరుణాచల్ లో కూడా
  • వెల్లడించిన అధికారులు
ఈ తెల్లవారుజామున 3.37 గంటల సమయంలో లడఖ్, కార్గిల్ తదితర ప్రాంతాల్లో భూకంపం ఏర్పడింది. హిమాలయ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. కార్గిల్ కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.7గా నమోదైందని సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు.

కాగా, ఇటీవలి కాలంలో కార్గిల్ ప్రాంతంలో భూమి తరచూ కంపిస్తోంది. గత గురువారం కూడా భూకంపం వచ్చింది. కాగా, తాజా ప్రకంపనలతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, అరుణాచల్ ప్రదేశ్ లోని పంజీన్ కు ఉత్తరంగా 683 కిలోమీటర్ల దూరంలో మరో భూకంపం 4.4 తీవ్రతతో ఈ ఉదయం నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 252 కిలోమీటర్ల లోతున ఉందని అధికారులు తెలిపారు.
Ladhak
Kargil
Earth Quake
Arunachal Pradesh

More Telugu News