గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన 25 పోలీసు బృందాలు
- 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న వికాస్ దూబే గ్యాంగ్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఏడుగురు పోలీసులు
- మృతుల కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం
దూబే ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ఇస్తామని మోహిత్ తెలిపారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని చెప్పారు. ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఏడుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూరుకు వెళ్లి మృతి చెందిన పోలీసుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పెన్షన్ తో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిని వారిని పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని అన్నారు.