అమరావతి పోరాటానికి బీజేపీ పూర్తిస్థాయిలో సంఘీభావం తెలుపుతోంది: కన్నా లక్ష్మీనారాయణ

  • అమరావతి కోసం చేస్తున్న పోరాటం 200వ రోజుకు చేరుకుంది
  • రాష్ట్ర భవిష్యత్తును ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేస్తోంది
  • ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తున్నాం
అమరావతే రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటం ఈరోజుతో 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజారాజధాని అమరావతి కోసం జరుగుతున్న పోరాటం నేటితో 200వ రోజుకు చేరుకుందని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసి ఏపీకి సరైన రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తున్నామని చెప్పారు. అమరావతి పోరాటానికి బీజేపీ పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతోందని అన్నారు.

Kanna Lakshminarayana
BJP
Amaravati

More Telugu News