Nara Lokesh: పార్టీ పనిపై విమానంలో వైసీపీ నేతలు ఎలా ఢిల్లీకి వెళ్తున్నారో చూడండి: ఫొటోలు పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fires on ycp leaders posts pics
  • ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఓం బిర్లాతో భేటీ
  • ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వైసీపీ నేతలు
  • రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం
  • స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారన్న లోకేశ్
ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు కొందరు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, పార్టీ అంశంపై మాట్లాడడానికి వారు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్తున్నారని టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ విమర్శించారు.
             
ఈ విషయంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ... 'కేంద్రానికి మొదటి లేఖగా సెర్బియా పోలీసుల చేతిలో చిక్కుకున్న సహ నిందితుడిని విడిపించమని ఉత్తరం రాశారు. ఇప్పుడేమో, మీ పార్టీ సమస్య కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు' అని విమర్శించారు.

'ఏ రోజు అయినా, కేంద్రం నుంచి రాబట్టే నిధుల కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం కోసం కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లారా ? మీ పంచాయితీల కోసం ప్రజాధనం వృథా చెయ్యడం ఏంటీ జగన్ గారు?' అని ప్రశ్నించారు. వారు విమానంలో ఢిల్లీకి వెళ్తోన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News