వణుకుతున్న కర్ణాటక.. గతంలో ఎన్నడూ  లేనంతగా కరోనా కేసుల నమోదు!

  • 24 గంటల్లో 1,502 కేసుల నమోదు
  • 19 మంది మృతి
  • 18 వేలు దాటిన మొత్తం కేసుల సంఖ్య
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా 24 గంటల్లో ఏకంగా 1,502 కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 18,016కి పెరిగింది. ఇదే సమయంలో కరోనా మరణాలు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నాయి. నిన్న ఏడుగురు కరోనాతో చనిపోగా... ఈరోజు 19 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 272కి చేరింది. కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా కట్టడి చర్యలను మరింత ఉద్ధృతం చేశారు.


More Telugu News

Karnataka Corona Virus cases