Jagan: హ్యాట్సాఫ్ జగన్ మోహన్ రెడ్డిగారు: పూరి జగన్నాథ్

Director Puri Jagannath appreciates Jagan
  • 1,088 అంబులెన్సులను ప్రారంభించిన పూరి జగన్నాథ్
  • విజయవాడ నుంచి జిల్లాలకు వెళ్లిన అంబులెన్సులు
  • ప్రశంసించిన పూరి జగన్నాథ్, తమన్
ఏపీలో 1,088 అంబులెన్సులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఈ వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అవన్నీ విజయవాడ నుంచి జిల్లాలకు పయనమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సీఎంను ప్రశంసించారు.

ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో... ఏపీ ప్రభుత్వం 108,104 వాహనాలను ప్రవేశపెట్టిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్ జగన్ గారూ అంటూ కొనియాడారు. సంగీత దర్శకుడు తమన్ కూడా ప్రశంసించారు.
Jagan
YSRCP
Puri Jagannadh
Thaman

More Telugu News