పతంజలికి ఊరట... మందు అమ్ముకోవచ్చు కానీ... కేంద్రం షరతులు!
- వారం రోజుల్లో కరోనా తగ్గుతుందని ప్రచారం
- కరోనాకు విరుగుడనిగానీ, నయం చేస్తుందనిగానీ ప్రచారం చేయరాదు
- కేవలం రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధమే
- అమ్మకాలకు ఆయుష్ మంత్రిత్వ శాఖ పచ్చజెండా
అయితే, ఇది కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందని గానీ, నయం చేస్తుందని గానీ ప్రచారం చేయరాదని కేంద్రం షరతు విధించింది. ఈ మేరకు 'కరోనిల్' అమ్మకాలకు పచ్చజెండా ఊపిన ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇది కరోనాకు ఔషధం కాదని స్పష్టం చేసింది. తమ షరతులకు అంగీకరిస్తూ, లిఖితపూర్వక హామీని ఇచ్చిన తరువాతనే కరోనిల్ ను మార్కెట్లోకి విడుదల చేయాలని స్పష్టం చేసింది.